: తీర్మానం అడ్డుకునే వరకే పదవుల్లో వుంటాం: మంత్రి టీజీ
అసెంబ్లీలో తీర్మానం ఓడించే వరకే తాము పదవుల్లో కొనసాగుతామని మంత్రి టీజీ వెంకటేష్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ మూడు నెలలు అనుభవించే పదవుల కోసం తాము పాకులాడట్లేదని అన్నారు. సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు లాబీయింగ్ చేయడం వల్లే విభజన ఆగిందని, ఆగుతుందని ఆయన అన్నారు. రాజధాని కన్నా రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకే తాము ప్రాధాన్యతనిస్తామని అన్నారు. ప్రజలు ముందుగానే ఆందోళనలు చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని ప్రజలను నిందించారు.