: రోహిత్ శర్మకు 1500 డాలర్ల జరిమానా
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు జరిమానా విధించారు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన టీట్వంటీ మ్యాచ్ లో ఓ ఓవర్ ఆలస్యంగా వేయించినందుకు రోహిత్ శర్మకు 1500 డాలర్లు జరిమానా విధించినట్టు ఛాంపియన్స్ లీగ్ నిర్వాహకులు తెలిపారు. రోహిత్ తో పాటు జట్టు సభ్యుడు ఒక్కొక్కరికి 750 డాలర్ల చొప్పున జరిమానా విధించారు.