: ఉద్యోగులపై ఎస్మా ప్రయోగానికి సిధ్థం: మంత్రి ఆనం


ఎస్మా చట్టాన్ని ఉద్యోగులపై ప్రయోగించేందుకు సిద్థమయ్యామని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఏపీఎన్జీవోలతో చర్చలు జరిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీఎన్జీవోలతో చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం లేదని అన్నారు. చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆలోచన లేదని, పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనుక సమ్మె విరమించాలని తాము కోరినట్టు మంత్రి తెలిపారు. సహేతుకమైన ముగింపు వచ్చే వరకు చర్చలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలతో లిఖితపూర్వక నివేదికలు కోరామని అన్నారు.

  • Loading...

More Telugu News