: సమైక్య రాష్ట్రం కావాలనడం మూర్ఖత్వం: పాల్వాయి
సీమాంధ్రులు సమైక్యరాష్ట్రం కావాలనడం మూర్ఖత్వమని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వెనక్కి తగ్గదని అన్నారు. డిసెంబర్ నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పాడతాయని జోస్యం చేప్పారు. సమైక్యఉద్యమం ఎన్నిరోజులు చేసినా ఉపయోగం ఉండదని ఆయన అన్నారు. ప్రభుత్వ పాలన ఇలాగే స్థంభిస్తే రాష్ట్రపతి పాలన విధించి విభజిస్తుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లోనూ యూటీ అయ్యే అవకాశమే లేదని ఆయన అన్నారు.