: అటవీ శాఖాధికారి హత్య కేసులో 11 మంది అరెస్టు
నిజామాబాద్ జిల్లాలోని అటవీశాఖాధికారి గంగయ్య హత్యకేసులో మొత్తం 36 మందిని నిందితులుగా గుర్తించామని, అందులో 11 మందిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ మోహన్ రావు తెలిపారు. మిగిలినవారిని కూడా పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. అటవీభూముల కబ్జాను అడ్డుకునేందుకు వెళ్లిన ఎఫ్.ఆర్.ఓ గంగయ్యను హత్యచేశారని ఆయన అన్నారు.