: ప్రజలు నేతలను కొట్టే పరిస్థితి వచ్చింది: చంద్రబాబు
రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో ప్రజలు రాజకీయ పార్టీల నేతలను కొట్టే పరిస్థితి వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ ను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల రాష్ట్రంలో ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రంలో ఒకలాగ, కేంద్రంలో ఒకలాగ వ్యవహరిస్తూ ప్రజల్లో విధ్వేషాలు రగులుస్తున్నారని బాబు మండిపడ్డారు. తాను కాంగ్రెస్ వ్యవహారాన్ని ఇతర పార్టీల దృష్టికి తీసుకెళ్తున్నానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం మానేసి స్వార్థరాజకీయాలకు పాల్పడటం వల్లే రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.