: కాంగ్రెస్ ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది: నారా లోకేష్
సామాజిక అనుసంధాన నెట్ వర్క్ ట్విట్టర్లో చురుకుగా స్పందించే టీడీపీ అధినేత తనయుడు నారా లోకేష్ మరోసారి కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ కారు(టీఆర్ఎస్) కు డీజిల్ పోస్తూ, ఫ్యాను(వైఎస్సార్ సీపీ)కు కరెంటు సరఫరా చేస్తోందని అన్నారు. టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీలకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఆ రెండు పార్టీలతో సానుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని ఆయన విమర్శించారు.