: యూపీఏ తుడిచిపెట్టుకుపోతుంది: నరేంద్ర మోడీ
యూపీఏ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. అమెరికాలోని ఫ్లోరెడా రాష్ట్రంలోని తాంపాలో రెండు రోజుల పాటు జరుగుతున్న ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆప్ బీజేపీ సదస్సులో ఎన్నారైలను ఉద్థేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, గడచిన 9 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అదఃపాతాళానికి తీసుకెళ్లిందని అన్నారు. యూపీఏ తొమ్మిదేళ్ల పాలనపై నివేదికను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1977లో సాధారణ ఎన్నికల తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనతాదళ్ ప్రభుత్వం ఎలా ఏర్పడిందో... 2014 లో కూడా బీజేపీ ప్రభుత్వం అలాగే ఏర్పడుతుందని అన్నారు. అయితే అందుకు ఎన్నారైల సహాయసహకారాలు కావాలని అన్నారు. బీజేపీ విజయానికి ఎన్నారైలే కీలకమన్నారు.