: సమైక్యత కోసం వెయ్యి గ్రామాల ఏకగ్రీవ తీర్మానం
అనంతపురం జిల్లాలో సమైక్యానికి అనుకూలంగా, విభజనను ఖండిస్తూ రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించాలని నినదిస్తూ జిల్లాలోని ఒక వెయ్యి మూడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఆ తీర్మానం కాపీలను సర్పంచులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కి పంపించారు. జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమాలు 54వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర విభజన ప్రకటించిన నాటి నుంచి 1000 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. విద్యాసంస్థలు తరగతులను నిర్వహించడం మానేశాయి. జిల్లావ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి.