: లగడపాటి ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు: ఉమ
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ మండిపడ్డారు. లగడపాటి ఇవాళ కావాలనే ఆటోనగర్ వెళ్ళి అక్కడ దీక్ష చేపట్టిన కార్మికులను రెచ్చగొట్టారని ఆరోపించారు. కచ్చితంగా అది ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే యత్నమేనని అన్నారు. లగడపాటికి చెందిన కంపెనీలకు కేంద్రం రాయితీలిస్తోందని, అందుకే ఆయన ఢిల్లీ కనుసన్నల్లో నడుచుకుంటూ ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు యత్నిస్తున్నారని ఉమ దుయ్యబట్టారు.