: త్వరలో వంద విమానాశ్రయాలు: ప్రధాని


రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా వంద చిన్న విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లా కిషన్ గఢ్ విమానాశ్రయానికి ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... గతంలో కేవలం ధనవంతులు మాత్రమే విమానాల్లో ప్రయాణించేవారని... ఇప్పుడు వియానయానం అందరికీ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ప్రభుత్వానికున్న ప్రాధాన్యాలలో విమానయానాన్ని అభివృద్ధి చేయడం కూడా ఒకటని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వైమానిక రంగాన్ని అభివృద్ధి చేస్తామని ప్రధాని అన్నారు.

  • Loading...

More Telugu News