: రాజ్ నాథ్ తో భేటీ కానున్న బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జాతీయ నాయకులను కలుస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ మధ్యాహ్నం వామపక్ష నేత ప్రకాశ్ కారత్ ను కలిసిన బాబు, ఈ సాయంత్రం 6.30 గంటలకు బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ గతంలో ఆంధ్రప్రదేశ్ పై అవలంభించిన విధానం, తాజాగా విభజన నిర్ణయం తరువాత ఏర్పడ్డ పరిస్థితులను రాజ్ నాథ్ కు బాబు వివరించనున్నారని సమాచారం.