: యూపీలో రాష్ట్రపతి పాలన విధించండి: రాజ్ నాథ్
ఉత్తరప్రదేశ్ లో అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని... అక్కడ వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ రోజు ముజఫర్ నగర్ లో పర్యటించాల్సిన రాజ్ నాథ్, జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో చెలరేగిన మతఘర్షణల నేపథ్యంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని అరెస్టు చేస్తుండటంతో రాజ్ నాథ్ తీవ్రంగా స్పందించారు. శాంతి భద్రతలను కాపాడలేని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని అన్నారు.