: కోహ్లీకి విశిష్ట గౌరవం


విరాట్ కోహ్లీ.. టీమిండియాలో స్థానం దక్కించుకున్న అతి స్వల్పకాలంలోనే తానేంటో నిరూపించుకున్న యువ కిశోరం. ఇప్పుడు అతని ప్రతిభకు మరో రంగంలోనూ గుర్తింపు దక్కింది. సీనియర్లు సచిన్, ధోనీల బాటలోనే ఇప్పుడీ ఢిల్లీ స్టార్ భారత సాయుధ బలగాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాడు. సచిన్ భారత వాయుసేనకు, ధోనీ భారత ఆర్మీకి సౌహార్ద్ర రాయబారులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కోహ్లీని తమ ప్రతినిధిగా ఎంపిక చేసినట్టు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ప్రకటించింది. కొద్దిరోజుల్లో ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో కోహ్లీని లాంఛనంగా బీఎస్ఎఫ్ కుటుంబంలోకి ఆహ్వానించనున్నారు.

  • Loading...

More Telugu News