: దుగరాజపట్నంలో నౌకాశ్రయానికి గ్రీన్ సిగ్నల్


నెల్లూరు జిల్లాలోని దుగరాజపట్నంలో మేజర్ పోర్ట్ ను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రం కొత్తగా నిర్మించ తలపెట్టిన రెండు పోర్టుల్లో దుగరాజపట్నం ఒకటి. ఇప్పటిదాకా మన రాష్ట్రం నుంచి విశాఖ మాత్రమే ప్రధాన నౌకాశ్రయం ఉంది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దుగరాజపట్నం పోర్టు విశాఖ సరసన చేరనుంది. ఈ పోర్టు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కార్యకలాపాలు నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రస్తుతం 13 పోర్టులను నియంత్రిస్తోంది.

కొత్తగా నిర్మించనున్న రెండు ప్రధాన పోర్టులతో మన దేశ నౌకా రవాణాను మూడింతలు పెంచుకోవడానికి కేంద్రం కసరత్తులు చేస్తోంది. నౌకా రవాణాలో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. దుగరాజపట్నం పోర్టుకు కేంద్రం పచ్చ జెండా ఊపడంతో... నెల్లూరు జిల్లాలో రెండో నౌకాశ్రయం ఏర్పాటుకానుంది. ఇప్పటికే జిల్లా నుంచి కృష్ణపట్నం పోర్టులో భారీఎత్తున కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News