: హస్తిన బయలుదేరిన మేధావులు
రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టాన్ని ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు సీమాంధ్ర మేధావి వర్గం హస్తినకు బయలుదేరింది. ఈ వర్గంలో తిరుపతిలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన ప్రముఖులు, ఉన్నత విద్య విభాగాల అధిపతులు, వైద్యులు ఉన్నారు. ఈ తెల్లవారుజామున వారు ఢిల్లీ పయనమయ్యారు. ఈ నెల 24 వరకు వారు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ పర్యటన సందర్భంగా వారు రాష్ట్రపతి, ప్రధాని, కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులతో పాటు ప్రతిపక్ష నేతలను కూడా కలిసి పరిస్థితులను వివరించనున్నారు.