: ప్రతిరోజూ నాకు చివరిరోజే...


"ప్రతిరోజూ నాకు చివరిరోజే కాబట్టే ప్రతి నిమిషాన్నీ నేను సద్వినియోగం చేయదలచుకున్నాను" ఈ వాక్యాలు వినడానికి చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి కదూ... ఈ వాక్యాలు అన్నది కూడా అద్భుతాన్ని సాధించిన వ్యక్తే. ఆ వ్యక్తే స్టీఫెన్‌ హాకింగ్‌. ఆయన జీవితం అందరికీ ఓ అద్భుతం. అందుకే ఆయన జీవితంపై, మృత్యువుపై ఆయన ఎప్పటికప్పుడు సాధిస్తున్న విజయంపై ఒక డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంటోంది. కేవలం 21 సంవత్సరాలకే మోటార్‌ న్యూరాన్‌ వ్యాధి సోకిన హాకింగ్‌ అప్పటినుండి కేవలం చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. అయితే ఏనాడూ తన వైకల్యాన్ని చూసి నిరాశచెందింది లేదు. ఎప్పటికప్పుడు తన వైకల్యంపై విజయం సాధిస్తూ గొప్ప భౌతిక శాస్త్రవేత్తగా ఎదిగాడు. ఇలా తన జీవితంలో సాధించిన అద్భుత విజయాలను, ఏ విధంగా శాస్త్రవేత్తగా ఎదిగింది? అనే విషయాలను ఒక డాక్యుమెంటరీగా రూపొందించనున్నారు. ఈ డాక్యుమెంటరీకి ఆయన సహ రచయితగా కూడా వ్యవహరించడమే కాకుండా కంప్యూటర్‌ ఆధారిత గొంతుతో ఇందులో మాట్లాడారు కూడా!

చిన్నతనంలో పార్టీలు చేసుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అలాంటి ఒక విద్యార్ధి అరుదైన వ్యాధిబారిన పడ్డాడు. ఇక ఎక్కువ కాలం బతకడంటూ అప్పట్లోనే వైద్యులు తేల్చేశారు. అప్పటినుండీ చక్రాలకుర్చీకే పరిమితమైనా తన మనోసంకల్పం ముందు మరణం ఓడిపోయింది. దీంతో ప్రపంచమే గర్వించదగిన గొప్ప శాస్త్రవేత్తగా స్టీఫెన్‌ నిలిచారు. ఈ డాక్యుమెంటరీలో స్టీఫెన్‌ బాల్యం నాటి సంగతులు, విద్యార్ధి జీవితం గురించి వివరించడమే కాకుండా మొదటి భార్య జేన్‌విల్డ్‌ సహా ఆయన కుటుంబ సభ్యుల అందరి ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. 90 నిముషాల నిడివివున్న ఈ డాక్యుమెంటరీకి స్టీఫెన్‌ ఫిన్నెగన్‌ దర్శకత్వం వహించారు.

  • Loading...

More Telugu News