: అంబేద్కర్ చెప్పారంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారు: కారెం శివాజీ


'అసలు అంబేద్కర్ ఏం చెప్పారో తెలుసుకుని మాట్లాడండి' అంటూ రాజకీయ నేతలకు మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ తెలిపారు. విజయవాడ 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో ఆయన మాట్లాడుతూ, ప్రెసిడెన్సీల క్రింద రెండు మూడు భాషలు మాట్లాడే ప్రజలతో పెద్దపెద్ద రాష్ట్రాలు ఉన్నప్పుడు, చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని అంబేద్కర్ అన్నారు. అంతేకానీ, భాషాప్రయుక్త రాష్ట్రాలను ముక్కలు చేయండని ఆయన చెప్పలేదని అన్నారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయేది దళితులేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాము విదేశాలు వెళ్లలేమని, కనీసం హైదరాబాద్ లో చదువుకునే, ఉద్యోగం చేసుకునే అవకాశాన్నైనా కల్పించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News