: రాష్ట్రం ముక్కలవ్వాలని కేసీఆర్, విజయలక్ష్మి కోరుకుంటున్నారు: వీరశివారెడ్డి
రాష్ట్ర విభజన ఎప్పుడు జరుగుతుందా? అని వైఎస్సార్ సీపీ ఎదురుచూస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో వైఎస్సార్ సీపీ ఖాళీ అయినందున రాష్ట్ర విభజన జరిగితే అధికారంలోకి రావచ్చనే భావనలో ఆ పార్టీ ఉందని అన్నారు. ఆధికార కాంక్షతో రాష్ట్రం ముక్కలు కావాలని కేసీఆర్, విజయలక్ష్మి కోరుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతి విషయాన్ని డబ్బుతో ముడిపెట్టి ఏపీఎన్జీవోలను అవమానించిన షర్మిళ వారికి తక్షణం క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో వైఎస్సార్సీపీ విధానం ఏంటో చెప్పకుండా కాంగ్రెస్, టీడీపీ లను లేఖలు అడగడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. విభజనకు ముందు తల ఊపి, తరువాత ప్లేటు ఫిరాయించాయని ఆయన టీడీపీ, వైఎస్సార్ సీపీలను విమర్శించారు.