: ఎమ్మెల్యే సమక్షంలో మున్సిపల్ అధికారులపై దాడి
రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ లో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పైనా, మున్సిపల్ అధికారులపైనా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎమ్మెల్యే సమక్షంలోనే మున్సిపల్ అధికారులపై స్థానికులు దాడికి దిగారు. దీంతో ఎమ్మెల్యే సర్దిచెప్పడంతో స్థానికులు శాంతించారు.