: విజయవాడ విమానాశ్రయ విస్తరణకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
విజయవాడ విమానాశ్రయ విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భూ సేకరణకు రూ.110 కోట్లు.. భవనాలు, ఇతర నిర్మాణాలకోసం రూ.170 కోట్లు కేటాయించేందుకు పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం ఈ ఉదయం సమావేశమైంది. మొత్తం 36 మంది మంత్రులకుగాను 28మంది మాత్రమే హాజరయ్యారు. మంత్రి గీతారెడ్డి, విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి దానం మినహా మిగతావారు రాగా, సమైక్యాంధ్రకోసం రాజీనామా చేసిన ఆరుగురు సీమాంధ్ర మంత్రులు హాజరుకాలేదు.