: ద్రవ్యోల్బణం ఒత్తిడితోనే రెపోరేటు పెంపు: రఘురాం రాజన్
ద్రవ్యోల్బణం ఒత్తిడి తీవ్రంగా ఉన్నందునే రెపోరేటు పెంచామని ఆర్ బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వివరణ ఇచ్చారు. దీనివల్ల ద్రవ్యోల్బణం తగ్గవచ్చన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించిన రాజన్ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో రాజన్ మాట్లాడుతూ.. రేపోరేటు పెంపుపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దీనివల్ల వృద్ధిపై అంతగా ప్రభావం పడుతుందని తాను అనుకోవడం లేదన్నారు.