: కేబినెట్ భేటీలో చర్చకు రాని తెలంగాణ నోట్
కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణ నోట్ అంశం చర్చకు రాలేదు. 45 నిమిషాలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించినప్పటికీ తెలంగాణ అంశంపై కనీస ప్రస్తావన కూడా లేకుండానే ముగిసింది. కాగా, ఈ భేటీలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. దీంతో 80 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.