: విజయవాడ సభకు భారీ బందోబస్తు
విజయవాడలో జరగనున్న 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్టు నగర డీసీపీ రవిప్రకాశ్ తెలిపారు. భద్రతా ఏర్పాట్ల కోసం ముగ్గురు ఏసీపీలు, సీఐలు, వందమంది ఎస్సైలు, 600 మంది పోలీసులను నియమించినట్టు తెలిపారు. సభ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా... ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.