: అబిడ్స్ లో ఏపీఎన్జీవోలు అరెస్ట్
ఏపీఎన్జీవోలు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో నేటి ఉదయం అబిడ్స్ లోని తపాలా శాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఏపీఎన్జీవోలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.