: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 13 మంది దుర్మరణం
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో నిన్న అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మరో పది మంది అపస్మారక స్థితిలో ఉన్నారు. ససర్లపల్లి గ్రామం వద్ద రాత్రి 11 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. చింతపల్లి ఎస్ ఐ కథనం ప్రకారం... అతి వేగంగా వస్తున్న లారీ ఒక క్రూయిజర్ తో పాటు మరో వ్యాన్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్రూయిజర్ లో ప్రయాణిస్తున్న వారితో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. వీరంతా నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తెలుగుపల్లిలో కర్మకాండకు వచ్చి హైదరాబాదుకు తిరుగుప్రయాణమయ్యారు. ఇంతలో ఈ దారుణం సంభవించింది. రోడ్డుపైన వాహనాలు అస్తవ్యస్తంగా పడిపోయాయి. లారీ డ్రైవర్ పయారయ్యాడని ఎస్ ఐ తెలిపారు.