: ఒక్క అడుగు ముందుకు పడినా రాజీనామాలే: లగడపాటి
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అంశంలో కేంద్రం ఒక్క అడుగు ముందుకేసినా తాము రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు. స్పీకర్ కార్యాలయంలో కూర్చుని రాజీనామాలు ఆమోదింపజేసుకుంటామని తెలిపారు. ఆంటోనీ కమిటీ త్వరలోనే రాష్ట్రానికి వచ్చి అన్ని వర్గాలతో సమావేశమవుతుందని అన్నారు. దిష్టి బొమ్మలు తగలబెట్టాలని తామెవరికీ సూచించలేదన్నారు. వేర్పాటు వాదుల్లా తాము విద్వేషాలు పెంచే చర్యలకు పాల్పడలేదన్నారు.