: ఇంకా తెలంగాణను ఆపాలనుకోవడం మూర్ఖత్వం: కేసీఆర్


కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత కూడా తెలంగాణను ఆపాలనుకోవడం మూర్ఖత్వమని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. హైదరాబాదులో ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత అన్ని రాజకీయపార్టీల రంగులు బయటపడ్డాయని విమర్శించారు. ప్రకటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మాటమార్చారని దుయ్యబట్టారు. తెలంగాణ వెనక్కిపోదని ప్రధానమంత్రి కూడా చెప్పారని కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రం చేసిన ప్రకటనను అమలు చేయించుకునేందుకే తాము మౌనంగా ఉన్నామని స్పష్టం చేశారు. హైదరాబాదు యూటీ అంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

రోజూ సీమాంధ్రలో తన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ కలిసుండాలనడం అవివేకమని పేర్కొన్నారు. అసలు ఆంధ్రా ప్రాంతంలో ఒక్క మేధావైనా ఉన్నాడా? అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రక్రియ పూర్తయ్యేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పోరాటం ముగిసిందని అజాగ్రత్తగా ఉండడం తగదని, జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. సీమాంధ్ర నేతలు చెబుతున్న లెక్కలు తప్పని అన్నారు.

  • Loading...

More Telugu News