: అటవీ శాఖపై సీఎం సమీక్ష
ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సిబ్బందిపై దాడులు ఎక్కువ అవుతుండటంతో.. అటవీ శాఖపై సీఎం కిరణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో చీఫ్ సెక్రటరీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... సిబ్బందిపై దాడి చేసిన వారిని క్షమించబోమని హెచ్చరించారు. దాడుల నివారణకు అవసరమైన నివేదికను రూపొందించి వీలైనంత త్వరగా సమర్పించాలని సీఎస్ ను ఆదేశించారు. అంతేకాకుండా, అటవీశాఖను బలోపేతం చేయడానికి అవసరమైన... 40 సాయుధ పోలీసు పార్టీల మంజూరుకు సీఎం ఆమోదం తెలిపారు. దుండగుల దాడులతో గాయపడిన అటవీశాఖ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు..