: బీసీసీఐ చీఫ్ గా తిరిగి ఎన్నుకోమంటాను: శ్రీనివాసన్
అల్లుడిపై ఐపీఎల్ బెట్టింగ్ ఆరోపణల నేపథ్యంలో కోర్టు కేసుల కారణంగా బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉంటున్న ఎన్. శ్రీనివాసన్ కు పదవిపై మోజు పోలేదు. అందుకే తిరిగి తనను బీసీసీఐ చీఫ్ గా ఎన్నుకోవాలంటూ బోర్డు సభ్యులను కోరతానంటున్నారు. స్పాట్ ఫిక్సింగ్ స్కాంలో తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ పైనా, తన ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ పైనా కోర్టులో కేసులు ఉండటంతో బీసీసీఐ అధ్యక్ష పదవినుంచి తాత్కాలికంగా తప్పుకున్నారు. రెండు సంవత్సరాల ఈ పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. దాంతో, తిరిగి తనను ఎన్నుకోవడం లేదా మరో సంవత్సరం పొడిగించడం కానీ చేయాలంటూ 29న జరగనున్న బోర్డు మీటింగ్ లో సభ్యులను అడగనున్నట్లు పేర్కొన్నారు.