: పోలీస్ కస్టడీకి రవీంద్రనాథ్ రెడ్డి
ఫోర్జరీ కేసులో కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే రేపు ఉదయం 10. 30 గంటల నుండి ఎల్లుండి ఉదయం 10.30 గంటల వరకు మాత్రమే కస్టడీలో ఉంచేందుకు మొదటి అదనపు సివిల్ జడ్జి అనుమతి ఇచ్చారు. కడప వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఆయన్ను న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు స్పష్టం చేసింది.