: రాయల వారి రాజదర్బార్ లో రాష్ట్ర విభజన సమస్య!


శ్రీకృష్ణ దేవరాయల రాజదర్బార్ లో ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యపై విచారణ జరుగుతోంది. రాయలతో పాటు తిమ్మరసు, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, భట్టుమూర్తి, ధూర్జటి, పింగళి సూరన, అల్లయ్యరాజు రామభద్రుడు, మాదయ్యగారి మల్లన్న, తెనాలి రామకృష్ణుడు, రాయల సేనాని, వేగుల మధ్య చంద్రగిరి కోటలో రాయల వారి రాజదర్బారులో రాజోద్యోగులు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ఆంటోనీ, షిండేలు రాజద్రోహం చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీకృష్ణదేవరాయలు.. రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఆంధ్రుల ప్రాభవాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేసినందుకు, విభజనకు పూనుకున్న దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ తీర్పునిచ్చారు.

దీంతో రాయలవారి కోట ప్రాంగణంలో రాష్ట్ర విభజనకు పూనుకున్న దోషుల బొమ్మలను ఉరితీసి రాజాజ్ఞను పాటించారు. ఈ తతంగమంతా చిత్తూరు జిల్లా చంద్రగిరిలో సమైక్యవాదుల నిరసనలో భాగంగా వినూత్న తరహాలో జరిగిన తంతు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యవాదులు రాయల సభ నిర్వహించి రాష్ట్రవిభజనకు కారకులైన వారిని శిక్షించారు.

  • Loading...

More Telugu News