: గణేశ్ నిమజ్జనంలో అపశృతి, ఇద్దరి గల్లంతు
ఎంతో ఆనందంగా జరుగుతోన్న గణేశ్ నిమజ్జనంలో ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు నదిలో పడి, గల్లంతయ్యారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని దొడ్డిబాడువ గ్రామంలో ఈ రోజు ఉదయం ఈ ఘటన జరిగింది. నదిలో పడిన వారిని రక్షించడానికి స్థానికులు ప్రయత్నించినప్పటికీ... వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాధ్యం కాలేదు. దీంతో అక్కడ విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం గల్లంతైన వారిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.