: హైదరాబాద్ లో కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనం


రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన ఈ కార్యక్రమం వర్షంతో కొంత ఆలస్యమైంది. అయినా 50వేల విగ్రహాల వరకు నిమజ్జనమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు కూడా ఖైరతాబాద్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో పలుచోట్ల వినాయక విగ్రహాలు నిమజ్జనానికి బారులు తీరాయి. ఒక్కొక్కటిగా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనమవుతున్నాయి. ప్రధానంగా భక్తుల జయ జయ ధ్వానాలతో ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. నిమజ్జనాన్ని చూసేందుకు ప్రజలు వేల సంఖ్యలో తరలిరావడంతో ట్యాంక్ బండ్ జనసంద్రమైంది. దాంతో, నేడు మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. అటు నగరంలో హుస్సేన్ సాగర్ సహా పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News