: పనబాకను అడ్డుకున్న సమైక్యవాదులు


కేంద్ర మంత్రి పనబాక లక్ష్మికి సమైక్య సెగ తగిలింది. ఆమె రాకకు సంబంధించిన సమాచారం అందుకున్న సమైక్యవాదులు పెద్ద ఎత్తున బాపట్ల రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అయితే వారి రాకను ముందే పసికట్టిన పోలీసులు... వారిని రైల్వే స్టేషన్ లోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత... ఆమె కాన్వాయ్ ను అడ్డుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన ఈ రోజు తెల్లవారుజామున జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ సమైక్యవాదులు బాపట్లలోని గడియారం స్తంభం సెంటర్లో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నివాసం వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News