: మీ ఫోన్లు జరభద్రం!
మీరు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా... అయితే మీ ఫోన్లలోకి ఒక కొత్తరకం వైరస్ జొరబడిపోయి మీకు సంబంధించిన సమాచారాన్ని తస్కరించేస్తోందట. అంతేకాదు మీ ప్రమేయం లేకుండానే ఇది ఫోన్లు చేసేస్తుందట... ఎస్‌ఎంఎస్‌లు పంపేస్తుందట... అలాంటి ఒక కొత్తరకం వైరస్ వ్యాపిస్తోందని సెర్ట్ హెచ్చరిస్తోంది.
ఆండ్రాయిడ్ నిర్వహణ వ్యవస్థ కలిగిన మొబైల్ ఫోన్లలోకి ఒక కొత్తరకం వైరస్ చొరబడిపోయి, మీ ప్రమేయం లేకుండానే ఫోన్‌కాల్స్ చేయడం, ఎస్‌ఎంఎస్‌లు పంపడం వంటివి చేస్తోందట. 4.2.2 (జెల్లీబీన్) వర్షన్‌కు ముందుగా వచ్చిన అన్ని వర్షన్లూ ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉన్నట్టు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సెర్ట్) హెచ్చరిస్తోంది. ఈ వైరస్ పట్ల అన్ని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పలు యాప్స్‌కు అనుమతులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ప్రమాదకరమైన, అనుమానాస్పదమైన లింక్‌లను తెరవడం, తెలియని మూలాలనుండి పలు యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం వంటివి చేయవద్దని సెర్ట్ హెచ్చరిస్తోంది. ఈ ప్రమాదకరమైన వైరస్‌ను పలు మొబైల్ ఫోన్లలో గుర్తించినట్టు ఈ సంస్థ చెబుతోంది.