: ఈ సైకిల్ సూపర్!
సైకిల్ సూపరేంటి... అదేమన్నా స్పోర్ట్స్ సైకిలా అని ఆశ్చర్యపోతున్నారా... అలాంటిది అని చెప్పలేంకానీ... దీన్ని కొందరు యువశాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ సైకిల్ మహావేగం. ఎంతవేగం అంటే గంటకు 133.78 కిలోమీటర్ల దూరం... అయితే దీన్ని తొక్కగలిగే సామర్ధ్యం కూడా సదరు సైకిలు డ్రైవరుకి ఉండాలిలెండి. అది సెబాస్టియర్ బోవియర్కు ఉంది. కాబట్టే... దీన్ని అంత వేగంగా తొక్కేసి తన పేరుతో ఒక రికార్డు తయారుచేసేసుకున్నాడు.
డెల్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, వీయూ యూనివర్సిటీ అమ్స్టర్డాంకు చెందిన విద్యార్ధులు కలిసి ఒక సైకిలును అభివృద్ధిచేశారు. ఈ సైకిల్ మామూలు సైకిళ్లలాంటిదికాదు. అత్యాధునికమైంది. ఇప్పటివరకూ అత్యంత వేగంగా సైకిలుపై వెళ్లిన ఘనత కెనడాకు చెందిన సాం విట్టింగ్ హాం పేరుతో ఉంది. అయితే ఈ కొత్త సైకిలుపై డచ్కి చెందిన 23 ఏళ్ల సెబాస్టియన్ బోవియర్ అనే యువకుడు గంటకు 133.78 కిలోమీటర్ల దూరం ప్రయాణంచేసి హాం పేరిట ఉన్న రికార్డును తన పేరుతో మార్చేసుకున్నాడు. హాంకన్నా కూడా బోవియర్ గంటకు 0.6 కిలోమీటర్ల అధికవేగం సాధించాడు. దీంతో రికార్డు మారింది.