: మా నేతలను అరెస్టు చేస్తే రణరంగమే: ఉమాభారతి
బీజేపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తే... పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆ పార్టీ నేత ఉమాభారతి హెచ్చరించారు. ముజఫర్ నగర్ అల్లర్లకు సంబంధించి బీజేపీకి చెందిన కొందరు నాయకులను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె యూపీ ముఖ్యమంత్రిని హెచ్చరించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి యూపీ అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తంచేశారు. పూర్తిస్థాయి విచారణ జరిగిన తర్వాతనే అరెస్టులు చేస్తామన్న యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ తన మాటను నిలుపుకోవాలని డిమాండ్ చేశారు.