: నల్గొండ జిల్లాలో ఘర్షణ, ఇద్దరి పరిస్థితి విషమం
నల్గొండ జిల్లాలో సీపీఎం, కాంగ్రెస్ పార్టీ వర్గీయులమధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘర్షణలో నలుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటన దేవరకొండ మండలం కొమ్మేపల్లిలో జరిగింది. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.