: జపాన్ ఓపెన్ రెండో రౌండ్ లో సింధు


భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం, తెలుగుతేజం సింధు జపాన్ ఓపెన్లో రెండో రౌండుకు చేరుకుంది. ఈ రోజు టోక్యోలో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-12, 21-13 తో స్థానిక షట్లర్ యుకినో నకాయ్ పై సునాయాసంగా గెలుపొందింది. రెండో రౌండ్లో సింధు జపాన్ క్వాలిఫయర్ అకానె యమగూచితో తలపడనుంది.

ఈ టోర్నీలో సింధుతో పాటు మరో తెలుగు ఆటగాడు శ్రీకాంత్ కూడా రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 22-20, 22-24, 21-18తో ప్రపంచ 22వ ర్యాంకర్, జపాన్ ఆటగాడైన షొ ససాకిపై గెలుపొందాడు. కాగా, సాయి ప్రణీత్, సౌరభ్ వర్మ తొలి రౌండ్లోనే ఇంటి దారి పట్టారు.

  • Loading...

More Telugu News