: ట్యాంక్ బండ్ కు క్యూ కడుతున్న గణనాథులు
మహానిమజ్జనం సందర్భంగా జంటనగరాల పరిధిలోని వేలాది వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్ బాటపట్టాయి. బాలాపూర్ వినాయకుడితో ఆరంభమైన శోభాయాత్ర చార్మినార్, మొజంజాహీ మార్కెట్ మీదుగా సాగనుంది. ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో గణనాథుల విగ్రహాలు కలుస్తాయి. కాగా, నిమజ్జనం సవ్యంగా సాగేందుకు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.