: నాన్నంటే ఇప్పటికీ భయమే: రణబీర్ కపూర్
బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ తానెవరికీ భయపడనని అన్నాడు. అయితే తన తండ్రి అంటే మాత్రం చచ్చేంత భయమన్నాడు. ఇప్పటికీ తన తండ్రి కళ్లలోకి చూసి మాట్లాడలేనని అన్నాడు. అక్టోబర్ 2న 'బేషరమ్' సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ, విజయానికి తానెప్పుడూ పొంగిపోలేదని అన్నాడు. తన తల్లిదండ్రులతో నటిస్తున్నందుకు ఆనందంగా ఉన్నప్పటికీ భయంగా ఉందని 'బేషరమ్' సినిమా గురించి చెప్పాడు. ఇంతియాజ్ అలీ, అనురాగ్ బసు వంటి డైరెక్టర్లతో పని చేయాలంటే కాస్త భయంగా ఉంటుందని తెలిపాడు. 'యేజవానీ హై దివానీ' సినిమాతో యువతను ఆకర్షించిన రణబీర్ మరోసారి 'బేషరమ్' సినిమాతో యువత ముందుకు రానున్నాడు.