: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి: కృష్ణయ్య


బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించేందుకు వీలుగా పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. భువనగిరిలో ఆయన మాట్లాడుతూ, సమాచార హక్కు, ఆహార భద్రత బిల్లు వంటి చట్టాలను తీసుకొచ్చిన యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ బీసీ బిల్లు కూడా తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని ఆయన సూచించారు. రానున్న ఎన్నికల్లో 25 పార్లమెంటు, 150 అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News