: న్యాయం చేస్తామని మొయిలీ హామీ ఇచ్చారు: అనంత
ఈ ఉదయం సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, న్యాయం చేస్తామని మొయిలీ హామీ ఇచ్చారని తెలిపారు. సీమాంధ్రలో ఉద్యమ తీవ్రతను మొయిలీ గుర్తించారని అనంత చెప్పారు. ప్రస్తుతానికి విభజన ప్రక్రియను కేంద్రం పక్కనబెట్టినట్టే అని పేర్కొన్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేవరకు ప్రక్రియ ముందుకు సాగబోదని ధీమా వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో ఆంటోనీ కమిటీ సభ్యులను, అధినేత్రి సోనియాను కలుస్తామని అనంత వెల్లడించారు.