: ఛాన్సొస్తే వదులుకోను: అఫ్రిది
పాకిస్తాన్ సీనియర్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది మరోసారి కెప్టెన్సీపై ఆశలు పెట్టుకున్నాడు. గత 17 ఏళ్లుగా పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షాహిద్ అఫ్రిదికి పీసీబీతో విభేదాల కారణంగా 2011 లో కెప్టెన్సీ ఊడింది. అయితే మిస్బా నాయకత్వంలో పెద్దగా విజయాలు సాధించని కారణంగా అఫ్రిదికి కెప్టెన్సీ అప్పగిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్రిది మరోసారి జాతీయ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం వస్తే వదులుకునే ప్రసక్తేలేదన్నాడు. జాతీయ జట్టుకు సారథ్యం వహించడం గొప్ప గౌరవమన్నాడు. బోర్డు కోరితే తక్షణం అంగీకరిస్తానని తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులో స్థానం సంపాదించటం చాలా కష్టమని అఫ్రిది తెలిపాడు.