: జగన్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా
అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ పిటిషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును సీబీఐ కోర్టు ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఉదయం సాగిన విచారణలో జగన్ కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ గట్టిగా వాదించింది. అంతకు ముందు జగన్ తరుపు న్యాయవాదులు రిమాండ్ ఖైదీగా జగన్ జైలులో ఏడాదికి పైగా గడిపాడని అతనికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని, ఒక రాజకీయ పార్టీ అధినేతగా కొనసాగుతున్నందున పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాల్సి ఉందని, జగన్ విచారణకు పూర్తిగా సహకరిస్తాడని తెలిపారు. దీనిపై తీర్పును న్యాయమూర్తి 23కి వాయిదా వేశారు.