: ఎమ్మెల్సీ పదవీకాలం పొడిగించాలని విజ్ఞప్తులు


విన్నపాలు..వినవలే.. అన్న చందంగా మారింది ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి. స్థానిక సంస్థల కోటా, ఎమ్మెల్యే, గవర్నర్ నామినేట్ చేసిన 24 మంది ఎమ్మెల్సీలకు పదవీకాలం ముగియనుంది. అలాగే వీరంతా రిటైర్ కానున్నారు. దీంతో వీరిలో చాలామంది తమ పదవీకాలాన్ని పొడిగించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు. 

స్థానిక సంస్థల కోటా కింద ఎన్నికైన పది మంది ఎమ్మెల్సీలు కూడా పదవీ విరమణ చేస్తున్నారు. వీరిలో అధికార పార్టీకి చెందిన వారు ఏడుగురు (టీజీవి కృష్ణా రెడ్డి, రాయపాటి శ్రీనివాస్-గుంటూరు, కె. ప్రేమ్ సాగర్ రావు- ఆదిలాబాద్, వై. శివరామిరెడ్డి- అనంతపురం, వాసిరెడ్డి వరద రామారావు- విజయనగరం, కె. జయచంద్రారెడ్డి-చిత్తూరు, ఎం.ఎస్. ప్రభాకర్-హైదరాబాద్) ఉన్నారు. వీరిలో రాయపాటి శ్రీనివాస్, టీజీవీ కృష్ణా రెడ్డి, జయ చంద్ర నాయుడులతో పాటు వరదరాజులు రెడ్డి, వై. శివరామిరెడ్డి కూడా ఛాన్స్ కోసం చూస్తున్నారు.

మరోవైపు ఎమ్మెల్యే కోటా కింద రిటైరవ్వబోతున్నవారు మొత్తం పదిమంది. వీరిలో పాలక పక్షానికి చెందినవారే ఐదుగురు (పొంగులేటి సుధాకర్ రెడ్డి, భారతి ధిరావత్, ఎస్. ఇంద్రసేన్ రెడ్డి, పుల్లా పద్మావతి వంటి తెలంగాణ నేతలతో పాటు కోస్తా ప్రాంతానికి చెందిన కందుల లక్ష్మీ దుర్గేశ్) ఉన్నారు. వీరిలో నలుగురు తమను రెన్యువల్ చేయాలని కోరుతున్నారు. 

అలాగే గవర్నర్ కోటాకింద రిటైర్ కాబోతున్న పీవీ రంగారావును ముఖ్యమంత్రి రెన్యువల్ చేయడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.  అలాగే మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్, అంగూరి లక్ష్మీ శివకుమారిలతో పాటు భమిడిపాటి రామ్మూర్తి లాంటి వారు కూడా ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News