: అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది!
మీరు ఏదైనా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే వెంటనే ఒక మీట నొక్కితే వెంటనే మిమ్మల్ని రక్షించేందుకు అవసరమైన వారికి మీరు ప్రమాదంలో ఉన్నట్టు సమాచారం చేరిపోతుంది. దీంతో వెంటనే పోలీసులు తదితర యంత్రాంగం కదలి మీరు ప్రమాదంలో చిక్కుకున్న చోటుకు చేరుకుని మిమ్మల్ని కాపాడుతారు. ఇలాంటి ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ప్రభుత్వం తయారుచేస్తోంది. దేశంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అత్యచారాలకు మహిళలు, వృద్ధులు, బాలికలు అనే తేడా లేకుండా అందరిపైనా లైంగికపరమైన దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో మహిళా రక్షణ కోసం ప్రభుత్వం ఇలాంటి ఒక సరికొత్త పరికరాన్ని తయారుచేస్తోంది.
అత్యవసర పరిస్థితుల్లో ఉండే మహిళలు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండే మహిళలు ఇలా ఒక మీట నొక్కితే చాలు, ముందుగానే గుర్తించిన కొన్ని నంబర్లకు మీరు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా సంకేతాలు వెళతాయి. దీంతో అధికార యంత్రాంగం మిమ్మల్ని కాపాడేందుకు ముందుకు వస్తుంది. ఐఐటీ`ఢల్లీి, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ`డీఏసీ)`తిరువనంతపురం వారు సంయుక్తంగా ఈ పరికరాన్ని రూపొందిస్తున్నారు. ఈ పరికరం అందుబాటులోకి వస్తే కొంతమేరకైనా మహిళలపై దాడులు తగ్గే అవకాశం ఉంది.