: ఒటాగో వోల్ట్స్ బోణీ
చాంపియన్స్ లీగ్ టి20 అర్హత పోటీల్లో న్యూజిలాండ్ దేశవాళీ జట్టు ఒటాగో వోల్ట్స్ బోణీ చేసింది. పాకిస్తాన్ కు చెందిన ఫైసలాబాద్ వోల్వ్స్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వోల్వ్స్ విసిరిన 140 పరుగుల లక్ష్యాన్ని ఒటాగో 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ జట్టులో స్టార్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ (65 బంతుల్లో 83 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సులు) బ్యాట్ కు పనిచెప్పడంతో ఒటాగో పని సులువైంది. కాగా, రెండో అర్హత మ్యాచ్ మరికాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కందురత మెరూన్స్ జట్ల మధ్య మొహాలీలో జరగనుంది.