: మోపిదేవి విడుదల
మాజీ మంత్రి మోపిదేవి ఎట్టకేలకు విడుదలయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో రిమాండ్ అనుభవిస్తున్న మోపిదేవి అనారోగ్య కారణాలతో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారించిన సీబీఐ న్యాయస్థానం అక్టోబర్ 31 వరకు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మోపిదేవి ఈ సాయంత్రం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు.